21, జనవరి 2013, సోమవారం

శతాబ్ది వెన్నెల

శతాబ్ది వెన్నెల – డా.కె.గీత

Satabadi Vennela Cover

ఉరుకులు, పరుగులతో నిండిన రోజులలో, ఒక్కసారి ఆగి, జీవితంలో వెనక్కు చూస్తే ఆ జ్ఞాపకాల ఊసులు మధురంగా ఉంటాయి కదా. అట్లాంటి అనుభూతిని, స్వాంతనను ఇచ్చే కవిత్వమే ఈ”శతాబ్ది వెన్నెల” పుస్తకం.
భారతదేశం, హైదరాబాదు నుంచి 13,600 కిలో మీటర్ల దూరం లో, అమెరికాలో, కాలిఫోర్నియాలోని, మౌంటైన్ వ్యూ లో ఉంటున్నా, 0 కిలో మీటర్ మైలు రాయి దగ్గరే ఉంటుంది రచయిత్రి మనస్సు. “జ్ఞాపకాల వలస పక్షులు” కవితలో అక్కడ జీవిస్తున్నా, ఇక్కడి జ్ఞాపకాలు ఎలా ముసురుకుంటాయో వివరిస్తారు.

కళ్ళు నులుము కుంటూ నిద్రలేచానా
పేము బెత్తంతో నాన్న తయారు
యోగర్టు కప్పు మూత తెరిచానా
మీగడ పాల వెన్న బువ్వ గోరుముద్దల అమ్మ ముఖం
జాంకాయ కాకెంగిలికున్న రుచి స్టాబెర్రీకుంటుందా!
బఠానీలతో బరువెక్కిన లాగు జేబు, జీన్స్ పాంటుకుంటుందా!”

ప్రేమించి, మమైకమయ్యాక, నువ్వు నాకొద్దు అంటే, మనసు ఎలా చిన్నపోతుంది! హైదరాబాదులో స్థిరపడిన కోస్తాంధ్ర ప్రజలను సంక్రాంతి సెలవుల తరువాత తెలంగాణాకు రాకుండా సరిహద్దు గోడ కడతామని అంటే మనసు విలవిలలాడదా!
“సరిహద్దు ప్రేమ” కవితలో
“అతడు నన్ను ఏనాడు అడగలేదు
ఎక్కణ్ణించి వచ్చావని?
అతడి సంస్కృతి వంటపట్టించుకున్నాను
ఒకరోజు ఏమైందో నాకే తెలియదు
హఠాత్తుగా వచ్చి నా కారు అద్దాలు పగలగొట్టాడు
నా ప్రాంతంలో నీ ఉనికి ఉండగూడదన్నాడు
నా ప్రాంతం – అతని ప్రాంతం
నేనెందుకు అతన్ని వదలి వెళ్ళాలో
నా ప్రేమంతా ఏమి చేసుకోవాలో అర్థం కావడం లేదు”

దేశాలు మారినా, కాలాలు మారినా మనుషుల మనస్తత్వం ఒక్కటే. ఎక్కడివారైనా మనుషులు మారరని షేక్‌స్పియర్ తన పాత్రల ద్వారా చెప్పాడు. అమెరికా లో కూడా మన చర్మపు రంగు మనమెవరో చెప్తుంది. అమెరికా లో జాతి వివక్షత నివురుగప్పిన నిప్పులా కనపడదు కాని……… కవయిత్రి గీత ఈ విషయమై తన అభిప్రాయం వెళ్ళడిస్తూ “Identity” అనే కవితలో అంటారు

“నిన్ను చూడగానే గుర్తించే రంగు
నీ ముఖాకృతి – నీ ఐడెంటిటి
నువ్వు అమెరికన్ ఇండియన్ వా
ఏషియన్ ఇండియన్ వా
……………………………………………
నీ శరీరం పైన వొలిస్తే లొపలేం ఉంది?
………………………………………………………
నీ భాషని కూడా ఈసడించే చూపు
నువ్వు ఇంగ్లిష్ మాట్లాడితే ఆఫీసరూ
స్పానిష్ మాట్లాడితే నౌకరూ ఎలా అయ్యేవసలు?”

“Optimism is life while pessimism is death” అని సంజీవదేవ్ ఒక చోట వ్రాస్తారు. గీత నిస్సందేహంగా గొప్ప ఆశావాది. మృత్యువులో కూడా జీవితాన్ని చూస్తుంది. రాలే ఉల్క ఏ అశుభానికి సూచనమో అని పెక్కుమంది తల్లడిల్లితే తను మటుకు “కిటికీ లేని గది”అనే కవితలో
“రోజూ కిటికీ వైపు చూస్తూనే ఉన్నాను
రాలిపడే నక్షత్రపు అదృష్టం కాస్తయినా తలకు రుద్దుకుందామని”

డా.గీత మనుషులను, మనస్సులను, అకాశాన్ని, నక్షత్రాలను మాత్రమే కాదు వన్యప్రాణులనూ తన కవితలలో స్పృసించకుండా వదలలేదు. కజిరంగా అభయారణ్యం (అస్సాం) గురించి వ్రాస్తూ-

“ఏనుగంత గడ్డిలో ఏనుగెక్కి సవారి
ఈ అకాశానికెన్ని జింకల అడుగుజాడలు !
ఎన్నెన్ని తెల్ల కొంగల మబ్బు మరకలు !!
ఖడ్గమృగాలు నిర్భయంగా కొమ్ము తలెత్తే సువిశాల మైదానం
గగనానికెక్కుపెట్టిన గడ్డిబాణాలు
ఏనుగుపాదం మునిగే నునుపైన బురద నేలలు”

జన్మ దినాన్ని అబ్దుల్ కలాం గారు ఇలా నిర్వచించారు – “నువ్వు రోదిస్తున్నప్పుడు, నీ తల్లి ప్రమోద భరితమయిన ఏకైక దినమే, నీ జన్మదినం”. గీత తన పుట్టిన రోజు అనుభూతులను “హేపీ బర్త్‌డే” అనే కవితలో వ్రాస్తారు
“సంవత్సరంలో ఏదో వింతజరిగిపోయినట్లు
భూమ్మీద మరెవరూ ఎప్పుడూ జన్మించనట్లు
ఒక కొత్త ఆనందం “

పిల్లలయితే ఎప్పుడు పెద్దవారమవుతామా అనే తొందరలో కొత్త జన్మదినాల్ని సాదరంగా ఆహ్వానిస్తే, పెద్దవారు ఇంకో సంవత్సరం పెద్దవారమయ్యామా అని ఖేద పడటమూ కద్దు. గీత మాటలలో
“ఇంకా ఎన్ని పుట్టిన రోజులు?!
అయ్యో! వయసొచ్చేస్తుంది!!
అసలింకా బర్త్‌డేలు చేసుకుంటారా?!
అంతా నాకు శుభాకాంక్షలు చెప్పేస్తే బావుణ్ణు”

ఇంకా ఎన్నో వైవిధ్యమయిన, డయాస్పరా గీతాలు, కవితలతో నిండినదీ కవితల పుస్తకం. సరిహద్దు ప్రేమ లాంటి కవితలు చదివిన చాన్నాళ్ళ తరువాత కూడా వెంటాడుతాయి. డా.గీత జ్ఞాపకాల ఊసుల సమారోహమే ఈ శతాబ్ది వెన్నెల. ఈ పుస్తకం అట్టపై చిత్రాన్ని డా|| గీత కూతురైన వరు గీస్తే, ముఖపత్ర రూపచిత్రణ కొడుకు కోమల్ చేయటం ముదాహవం. కవితలను ఆస్వాదించేవారిని అలరించగలదీ చిన్న పుస్తకం.
---------------------------------------
1/8 డెమి: పుటలు 108
ధర: రూ129/-
సత్య ప్రచురణలు, హైదరాబాదు.
లభ్యత: విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవోదయ, దిశ పుస్తక దుకాణాల్లో.
Blog: http://kalageeta.wordpress.com/

పంచతంత్రం (నవల)

పంచతంత్రం (నవల) 
 రచన: బొజ్జా తారకం ...

కారంచేడు (1985) నుంచి లక్ష్మింపేట (2012) వరకూ దళిత ఉద్యమాలలో కీలకపాత్రవహిస్తూ న్యాయపోరాటాలు చేస్తూ రాజకీయ సామాజిక రంగాలను ప్రభావితం చేస్తున్న రచయిత బొజ్జా తారకం కలం నుంచి రూపుదిద్దుకున్న ఈ నవల అట్టడుగు వర్గాల బాధామయ జీవితాలకు దర్పణం పడుతుంది.

కారంచేడులో అగ్రవర్ణాలవారు దళితులపై సాగించిన అమానుష మారణకాండకు నిరసనగా 1984లోనే బొజ్జాతారకం గారు హైకోర్టులో గవర్నమెంట్‌ ప్లీడర్‌ ఉద్యోగానికి రాజినామా చేశారు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్‌ దళిత మహాసభ సహవ్యవస్థాపకుడిగా దళితుల నిరసనోద్యమానికి దశాబ్దకాలంపాటు వెన్నుదన్నుగా నిలిచారు. అగ్రకుల దౌష్ట్యానికీ, వర్గ దోపిడీకీ గురయ్యే ప్రజల పక్షాన రాజీలేని పోరాటం సాగించే ఆయన ఇప్పటికీ దళితులను సంఘటితపరిచే కార్యక్రమాలకే తన పూర్తికాలాన్ని వెచ్చిస్తున్నారు.

భారత రిపబ్లికన్‌ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా కూడా పనిచేస్తున్నారు. మానవ హక్కుల ఉద్యమాల్లో ఎంతో క్రియాశీలంగా పాల్గొంటున్నారు. రాజకీయ నాయకుడిగానే కాకుండా రచయితగా కూడా ఆయనకు మంచి పేరుంది. వీరి రచనల్లో ''పోలీసులు అరెస్టు చేస్తే'', ''కులం-వర్గం'', ''నది పుట్టిన గొంతుక'', ''నేల నాగలి మూడెద్దులు'', ''దళితులు-రాజ్యం'' ప్రముఖమైనవి.

పంచతంత్రం నవల గురించి రచయిత మాటల్లోనే ...

'' ఈనవల ఇలా సాగుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. ఇలా రాయాలనీ అనుకోలేదు. ఈయీ పాత్రలు, ఈయీ సన్నివేశాలు ఉండాలనీ అనుకోలేదు. ముగింపు ఇలా ఉండాలనీ అనుకోలేదు. వరదపొంగులా అది అ లా సాగిపోయింది. నవల ఇలా మొదలుపెట్టాలని మాత్రం అనుకున్నాను. అంతే. ఆ తర్వాత నా చేతుల్లో లేపోయింది.

పాత్రలు, సన్నివేశాలు, అ లా అ లా అనుకోకుండా సాగిపోయాయి. హఠాత్తుగా తెరమీదికి అనుకోని వ్యక్తులు వచ్చినట్టు చాలా పాత్రలు నవలలోకి వచ్చేశాయి. చెప్పాపెట్టకుండా బంధువులు ఇంటికి వచ్చినట్టు, తలుపు తోసుకుని లోపలికి వచ్చినట్టు ఈ పాత్రలు వచ్చేశాయి. నాకే ఆశ్చర్యం వేసింది, ఎలా వచ్చాయా అని. అయితే అన్నీ నాకు తెలిసిన పాత్రలే కాబట్టి వాళ్ల చుట్టూ, వాళ్లతో కథ అ ల్లుకుపోయాను. ఒక జీవితానికి సంబంధించిన కథ కాదిది. వేలాది, లక్షలాది జీవితాలకు సంబంధించిన గాధ, వేదన, ఆవేశం, ఆకాంక్ష. నలభై ఏళ్లుగా రాయాలనుకున్న నవల....

ఇందులోని సంఘటనలు అన్నీ గొప్పవి. సన్నివేశాలూ పాత్రలూ అంతే. అయితే వాటిని నేను పూర్తిగా చిత్రీకరించలేకపోతే లోపం నాది, పాత్రలది కాదు. ఈ పాత్రలన్నీ మనముందే తిరుగుతున్నాయి. ...''

పంచతంత్రం (నవల)
రచన: బొజ్జా తారకం
290 పేజీలు, వెల: రూ.100/-

ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీనగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌ - 500 006.

ఫోన్‌ నెం. 040-2352 1849

ఇమెయిల్‌:  hyderabadbooktrust@gmail.com

నిజాం పాలనలో లంబాడాలు

నిజాం పాలనలో లంబాడాలు
(Subjugated Nomads; The Lambadas under the Rule of the Nizams)
- భంగ్యా భుక్యా

ఈ పుస్తకం ఇంగ్లీష్‌లో వెలువడిన తరువాత దేశ, విదేశీ జర్నల్స్‌లో చాలా విశ్లేషణలే వచ్చాయి. చాలా విశ్లేషణలు ఈ పుస్తకాన్ని పొగడ్తలతో ముంచెత్తాయి. ముఖ్యంగా ''ఎకనమిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ, సోషల్‌ సైంటిస్ట్‌, ది బుక్‌ రివ్యూ''లలో వచ్చిన విశ్లేషణలు ఈ పుస్తకానికి ప్రపంచ స్థాయి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను.

ఈ పుస్తకం ఇంత ప్రాచుర్యం పొందటానికి నేను ఎంచుకున్న అధ్యయన అంశమే కారణమని చెప్పాలి. లంబాడాలు ఏవిధంగా వలసవాద పాలనలో వచ్చిన ఆధునిక రాజకీయ, పాలన, ఆర్థిక విధానాలను ఎదుర్కొని ఒక సామాజిక వర్గంగా రూపాంతరం చెందారో ఈ పుస్తకం వివరిస్తుంది.

ఇందులో రెండు వందల సంవత్సరాల లంబాడాల చరిత్రను విశ్లేషించడటమే కాకుండా ఆనాటి ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిస్థితులను కూడ వివరించటం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఈ దేశ చరిత్ర నిర్మాణంలో లంబాడాల పాత్రను వివరిస్తుందిది.

దేశ నిర్మాణంలో చరిత్ర ఎంత కీలక పాత్ర పోషిస్తుందో ఒక చరిత్రకారుడిగా నాకు తెలుసు. అనేక జాతుల/కులాల సమ్మేళనమైన భారతదేశం వంటి దేశంలో చరిత్ర మరింత ముఖ్య పాత్ర వహిస్తుంది. జాతుల/కులాల ఆధిపత్యానికి, విముక్తికి చరిత్రే మూలం.

చరిత్రను ఉపయోగించుకొనే ఆధిపత్య కులాలు సమాజంలో పెత్తనం చలాయిస్తున్నాయి. ఈ ఆధిపత్య కులాల చరిత్రను తిరగ రాయడం ద్వారా అణగారిన కులాలను శాశ్వతంగా విముక్తి చేయగలుగుతాము. 1990 నుంచి దేశంలో, రాష్ట్రంలో వస్తున్న దళిత, బహుజన, ఆదివాసి చైతన్య ఉద్యమాలు ఈ దశగా ఆలోచించి తమ జాతుల చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేస్తున్నాయి.

ఈ పుస్తకాన్ని తెలుగులో తీసుకురావడాన్ని ఈ నేపథ్యం నుంచే చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కారంచేడు, చుండూరు సంఘటనలు, మండల్‌ కమిషన్‌ అనుకూల ఉద్యమాలు, కాన్షీరాం బహుజన ఉద్యమం, స్త్రీవాద ఉద్యమం, దండోరా ఉద్యమం మొదలైనవి దళిత, ఆదివాసీ, బహుజన రచనలకు స్ఫూర్తినిచ్చాయి.

దళిత రచయితలు ఆధిపత్య కులాల/వర్గాల చరిత్రను ధిక్కరిస్తూ నూతన పంథాలో తమ జాతుల చరిత్రను, సాహిత్యాన్ని తిరగరాసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో దళిత చరిత్రలు, దళిత కవిత్వాలు, దళిత ఆత్మ కథలు ఎన్నో తెలుగులో వచ్చాయి. అయితే ఆదివాసీ, సంచార జాతుల రచనలు మాత్రం చాలా తక్కువనే చెప్పాలి. ఈ పుస్తకం ఆ లోటును కొంతవరకైనా తీరుస్తుందని భావిస్తున్నాను.

- భంగ్యా భుక్యా

(తెలుగు అనువాదానికి ముందుమాట నుంచి)
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

ఈ పుస్తకంపై కొన్ని అభిప్రాయాలు:

''లంబాడాల రాజకీయ, ఆర్థిక స్థితిగతులను భంగ్యా భుక్యా చాలా లోతుగా, సునిశితంగా పరిశోధించి వెలుగులోకి తెచ్చిన రచన ఇది. ఒకనాడు స్వతంత్రంగా, సగర్వంగా మెలిగిన లంబాడా జాతి వలసపాలన, దాని నియంత్రణల కింద నలిగి నలిగి ఎలా క్షీణించిపోయిందో పట్టి చూపారు రచయిత. సమకాలీన అస్తిత్వ ఉద్యమాలనూ, 20వ శతాబ్దంలో వాటి ప్రాముఖ్యతనూ సవివరంగా చర్చించటం దీని ప్రత్యేకత.''

..............................
...............................................- క్రిస్పిన్‌ బేట్స్‌ (ఎడిన్‌బర్గ్‌ విశ్వవిద్యాలయం)

''లంబాడా జాతి, వారి జీవన విధానంపై జరిగిన తొలి శాస్త్రీయమైన అధ్యయనం ఇది. ఒక స్వతంత్ర జాతిని - రాజ్యం దాని పరిపాలనా విధానాలు ఎలా అణగదొక్కాయో తెలియజేస్తుంది. ప్రభుత్వ బంజరు భూములను 'రక్షిత అడవులు'గా మార్చటం, లంబాడాలకు నేరపూరిత మనస్తత్వాన్ని ఆపాదించటం వంటి అంశాలన్నింటినీ చారిత్రకంగా చర్చిస్తూ, ఆసక్తికరంగా పాఠకుల ముందుంచుతుంది ఈ రచన.''

..............................
..............................................- డేవిడ్‌ హార్డిమాన్‌ (వార్‌విక్‌ విశ్వవిద్యాలయం)

''సుసంపన్నమైన ఒక వ్యాపార వర్గాన్ని వలసవాద పాలనా పద్ధతులు ఎలా మార్చివేశాయో, హైదరాబాదు రాష్ట్రంలో లంబాడాలు ఏవిధంగా 'నేర జాతి'గా ముద్రవేయబడి అణిచివేతకు గురయ్యారో తెలుసుకునేందుకు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ఇది.''

..............................
...................- గేల్‌ ఆంవెట్‌ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌, సిమ్లా)
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రచయిత గురించి:

భంగ్యా భుక్యా పన్నెండేళ్ళ పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చరిత్ర బోధించారు. ప్రస్తుతం ఇఫ్లూ యూనివర్సిటీలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సోషల్‌ ఎక్స్‌క్లూజన్‌ స్టడీస్‌ విభాగంలో చరిత్ర అధ్యాపకుడుగా పనిచేస్తున్నారు.

హైదరాబాద్‌ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ.ఎంఫిల్‌ చేసిన ఆయన ఫోర్డ్‌ ఫౌండేషన్‌ నుంచి అంతర్జాతీయ ఫెలోషిప్‌ సాధించి ఇంగ్లండ్‌లోని వార్‌విక్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డి చేశారు.

కులం ఆదివాసీ జాతుల చరిత్రలు, అస్తిత్వ రాజకీయాలు, జాతులు - తెగలపై రాజ్యం దాని యంత్రాంగం చూపే ప్రభావం వంటి సామాజిక ప్రాధాన్యమున్న అంశాలపై లోతైన అధ్యనం చేస్తున్న ఆయన లండన్‌, ఆక్స్‌ఫర్డ్‌, ఎడిన్‌బరో, వార్‌విక్‌ తదితర ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీల్లో ఉపన్యాసాలిచ్చారు. పలు జాతీయ, అంతర్జాతీయజీ జర్నల్స్‌కు వ్యాసాలు రాశారు. ప్రస్తుతం మధ్య భారతంలోని గోండు జాతిపై అధ్యయనం జరుపుతున్నారు.

నిజాం పాలనలో లంబాడాలు

- భంగ్యా భుక్యా

ఆంగ్ల మూలం : Subjugated Nomads; The Lambadas under the Rule of the Nizams, Orient Blackswan, Hyderabad, 2010

తెలుగు అనువాదం : ఆకెళ్ల శివప్రసాద్‌

157 పేజీలు, వెల : రూ.80/-

ప్రతులకు వివరాలకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌

ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006

ఫోన్‌: 040 - 2352 1849

ఇ మెయిల్‌: hyderabadbooktrust@gmail.com
నిజాం పాలనలో లంబాడాలు
 (Subjugated Nomads; The Lambadas under the Rule of the Nizams) 
- భంగ్యా భుక్యా

నిజాం పాలనలో లంబాడాలు
- భంగ్యా భుక్యా
 
ఈ పుస్తకం ఇంగ్లీష్‌లో వెలువడిన తరువాత దేశ, విదేశీ జర్నల్స్‌లో చాలా విశ్లేషణలే వచ్చాయి. చాలా విశ్లేషణలు ఈ పుస్తకాన్ని పొగడ్తలతో ముంచెత్తాయి. ముఖ్యంగా ''ఎకనమిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ, సోషల్‌ సైంటిస్ట్‌, ది బుక్‌ రివ్యూ''లలో వచ్చిన విశ్లేషణలు ఈ పుస్తకానికి ప్రపంచ స్థాయి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను.

ఈ పుస్తకం ఇంత ప్రాచుర్యం పొందటానికి నేను ఎంచుకున్న అధ్యయన అంశమే కారణమని చెప్పాలి. లంబాడాలు ఏవిధంగా వలసవాద పాలనలో వచ్చిన ఆధునిక రాజకీయ, పాలన, ఆర్థిక విధానాలను ఎదుర్కొని ఒక సామాజిక వర్గంగా రూపాంతరం చెందారో ఈ పుస్తకం వివరిస్తుంది.

ఇందులో రెండు వందల సంవత్సరాల లంబాడాల చరిత్రను విశ్లేషించడటమే కాకుండా ఆనాటి  ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిస్థితులను కూడ వివరించటం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఈ దేశ చరిత్ర నిర్మాణంలో లంబాడాల పాత్రను వివరిస్తుందిది.

దేశ నిర్మాణంలో చరిత్ర ఎంత కీలక పాత్ర పోషిస్తుందో ఒక చరిత్రకారుడిగా నాకు తెలుసు. అనేక జాతుల/కులాల సమ్మేళనమైన భారతదేశం వంటి దేశంలో చరిత్ర మరింత ముఖ్య పాత్ర వహిస్తుంది. జాతుల/కులాల ఆధిపత్యానికి, విముక్తికి చరిత్రే మూలం.

చరిత్రను ఉపయోగించుకొనే ఆధిపత్య కులాలు సమాజంలో పెత్తనం చలాయిస్తున్నాయి.  ఈ ఆధిపత్య కులాల చరిత్రను తిరగ రాయడం ద్వారా అణగారిన కులాలను శాశ్వతంగా విముక్తి చేయగలుగుతాము. 1990 నుంచి దేశంలో, రాష్ట్రంలో వస్తున్న దళిత, బహుజన, ఆదివాసి చైతన్య ఉద్యమాలు ఈ దశగా ఆలోచించి తమ జాతుల చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేస్తున్నాయి.

ఈ పుస్తకాన్ని తెలుగులో తీసుకురావడాన్ని ఈ నేపథ్యం నుంచే చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కారంచేడు, చుండూరు సంఘటనలు, మండల్‌ కమిషన్‌ అనుకూల ఉద్యమాలు, కాన్షీరాం బహుజన ఉద్యమం, స్త్రీవాద ఉద్యమం, దండోరా ఉద్యమం మొదలైనవి దళిత, ఆదివాసీ, బహుజన రచనలకు స్ఫూర్తినిచ్చాయి.

దళిత రచయితలు ఆధిపత్య కులాల/వర్గాల చరిత్రను ధిక్కరిస్తూ నూతన పంథాలో తమ జాతుల చరిత్రను, సాహిత్యాన్ని తిరగరాసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో దళిత చరిత్రలు, దళిత కవిత్వాలు, దళిత ఆత్మ కథలు ఎన్నో తెలుగులో వచ్చాయి. అయితే ఆదివాసీ, సంచార జాతుల రచనలు మాత్రం చాలా తక్కువనే చెప్పాలి. ఈ పుస్తకం ఆ లోటును కొంతవరకైనా తీరుస్తుందని భావిస్తున్నాను.

- భంగ్యా భుక్యా
(తెలుగు అనువాదానికి ముందుమాట నుంచి)
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

ఈ పుస్తకంపై కొన్ని అభిప్రాయాలు:

''లంబాడాల రాజకీయ, ఆర్థిక స్థితిగతులను భంగ్యా భుక్యా చాలా లోతుగా, సునిశితంగా పరిశోధించి వెలుగులోకి తెచ్చిన రచన ఇది. ఒకనాడు స్వతంత్రంగా, సగర్వంగా మెలిగిన లంబాడా జాతి వలసపాలన, దాని నియంత్రణల కింద నలిగి నలిగి ఎలా క్షీణించిపోయిందో పట్టి చూపారు రచయిత. సమకాలీన అస్తిత్వ ఉద్యమాలనూ, 20వ శతాబ్దంలో వాటి ప్రాముఖ్యతనూ సవివరంగా చర్చించటం దీని ప్రత్యేకత.''
.............................................................................- క్రిస్పిన్‌ బేట్స్‌ (ఎడిన్‌బర్గ్‌ విశ్వవిద్యాలయం)

''లంబాడా జాతి, వారి జీవన విధానంపై జరిగిన తొలి శాస్త్రీయమైన అధ్యయనం ఇది. ఒక స్వతంత్ర జాతిని - రాజ్యం దాని పరిపాలనా విధానాలు ఎలా అణగదొక్కాయో తెలియజేస్తుంది. ప్రభుత్వ బంజరు భూములను 'రక్షిత అడవులు'గా మార్చటం, లంబాడాలకు నేరపూరిత మనస్తత్వాన్ని ఆపాదించటం వంటి అంశాలన్నింటినీ చారిత్రకంగా చర్చిస్తూ, ఆసక్తికరంగా పాఠకుల ముందుంచుతుంది ఈ రచన.''
............................................................................- డేవిడ్‌ హార్డిమాన్‌ (వార్‌విక్‌ విశ్వవిద్యాలయం)

''సుసంపన్నమైన ఒక వ్యాపార వర్గాన్ని వలసవాద పాలనా పద్ధతులు ఎలా మార్చివేశాయో, హైదరాబాదు రాష్ట్రంలో లంబాడాలు ఏవిధంగా 'నేర జాతి'గా ముద్రవేయబడి అణిచివేతకు గురయ్యారో తెలుసుకునేందుకు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ఇది.''
.................................................- గేల్‌ ఆంవెట్‌ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌, సిమ్లా)
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,